Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉరే సరి : అలా చేస్తే ఇక మరణదండనే

Webdunia
గురువారం, 11 జులై 2019 (09:00 IST)
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారిని ఉరితీయాలని నిర్ణయించింది. ఈ మేరకు మోడీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఇకపై ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు పోక్సో చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. 
 
ఫలితంగా చిన్నారులపై లైంగిక నేరాలకు ఉరిశిక్ష విధించేలా చట్టాన్ని సవరించనున్నారు. దీంతోపాటు చైల్డ్ పోర్నోగ్రఫీకి జరిమానా, జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తీసుకురానున్నారు. బుధవారం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో మరికొన్ని ఉన్నాయి. 
 
దేశంలోని సంఘటిత, అసంఘటిత కార్మికుల కోసం 'కార్మిక రక్షణ కోడ్‌'కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కోడ్‌లోకి 13 కేంద్ర కార్మిక చట్టాలను తీసుకురానున్నారు. దీనివల్ల వాణిజ్యం, వ్యాపారం, తయారీ, సేవా, ఐటీ తదితర రంగాల కార్మికులకు మేలు జరగనుంది. పదిమందికి మించి పనిచేసే అన్ని పరిశ్రమలకు ఈ కోడ్ వర్తిస్తుంది. దీంతోపాటు ఆర్పీఎఫ్ సర్వీసులకు గ్రూప్-ఎ హోదా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం