Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అస్త్ర' క్షిపణిని పరీక్షించనున్న భారత్

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (21:09 IST)
Astra missile
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన, గగనతలం నుంచి గగనతలంలోని సుదూర లక్ష్యాలను ఛేదించగల 'అస్త్ర' క్షిపణిని భారత్‌ మరోసారి పరీక్షించనుంది. వైమానిక పోరాటంలో సరిహద్దు దేశాలు చైనా, పాకిస్థాన్‌లపై ఆధిపత్యం ప్రదర్శించే దిశగా రూపొందించిన 'అస్త్ర' మార్క్‌ 2 మిసైల్‌ను భారత్‌ పరీక్షించేందుకు సన్నద్ధమవుతున్నది. ఈ క్షిపణి 160 కిలో మీటర్ల లోపు దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 
 
అధునాతన అస్త్ర మార్క్‌ 2 గగనతల పోరాటంలో యుద్ధ విమానాలకు మరింత శక్తినిస్తుంది. తర్వాతి తరం క్షిపణి 'అస్త్ర' మార్క్‌ 2 వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని మాజీ సెంట్రల్‌ ఎయిర్‌ కమాండర్‌ ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌బీపీ సిన్హా(రిటైర్డ్‌) తెలిపారు. 
 
భారత వైమానిక దళం, నావికాదళం ఇప్పటికే 288 అస్త్ర మార్క్ -1 క్షిపణుల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. రష్యాకు చెందిన సుఖోయ్ -30 ఎంకేఐ యుద్ధ విమానాల నుంచి ఈ క్షిపణులను విజయవంతంగా ప్రయోగించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments