Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పు లడఖ్‌లో సర్వసన్నద్ధంగా ఇండియన్ వైమానికి దళం

Webdunia
ఆదివారం, 5 జులై 2020 (15:54 IST)
తూర్పు లడఖ్‌ ప్రాంతంలో భారత వైమానికదళం సర్వ సన్నద్ధంగా ఉంది. ఈ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో చైనా బలగాలు గత నెల 15వ తేదీన భారత సైనికులపై దొంగచాటుగా దాడి చేసి 20 మందిని చంపేసిన విషయం తెల్సిందే. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 
 
ఈ సరిహద్దు ఉద్రిక్తత దృష్ట్యా భారత వైమానిక దళం సర్వ సన్నద్ధమైంది. ఫ్రంట్‌లైన్ జెట్లు, వైమానిక దాడిలో వినియోగించే హెలికాఫ్టర్లను, రవాణాకు సంబంధించిన విమానాలను వాస్తవ నియంత్రణ రేఖ వెంట గగనతలంలో కాపలాగా ఉంచుతోంది. 
 
రవాణాకు వినియోగించే అమెరికన్ సి-17 తో పాటు సి-130జె, రష్యాకు చెందిన ఇల్యూచిన్-76, ఆంటోనోవ్ -32 లాంటి వాటిల్లో దళాలను, సామాగ్రిని రవాణా చేయడానికి ఇప్పటికే వాయుసేన మోహరించింది. అపాచీ యుద్ధం విమానమైతే నిరంతరం గస్తీ కాస్తూనే ఉంది. 
 
ఈ స్థావరం మొత్తం కూడా కార్యకలాపాలను పర్యవేక్షించడం, జవాన్ల సంసిద్ధతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. 'ఈ ప్రాంతంలో కార్యకలాపాలను నిర్వహించడంలో ఈ స్థావరం చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ స్థావరం ఎలాంటి ఆకస్మిక చర్యలను చేపట్టడానికైనా, పోరాటం చేయడానికైనా సర్వ సన్నద్ధంగా ఉంది' అని ఓ ఉన్నతాధికారి ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments