Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్ట‌ప‌ర్తిని ప్ర‌సాద్ స్కీంలో చేర్చండి...

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (11:42 IST)
అనంత‌పురం జిల్లాలో ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేయాల‌ని కేంద్ర మంత్రికి విజ్ణ్న‌ప్తులు చేరాయి. ఈ ప్రాంతాన్ని కేంద్రం ప్ర‌త్యేకంగా చేప‌ట్టిన PRASAD ప‌థ‌కంలో చేర్చాల‌ని... పుట్ట‌ప‌ర్తిపై పూర్తి నివేదిక‌ను అందజేశారు.

ఢిల్లీ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ క‌లిశారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అయిన పుట్టపర్తి ని PRASAD SCHEME  ద్వారా మరింత విసృత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. కేంద్ర ప‌ర్యాట‌క శాఖ‌కు దీనిపై పూర్తి స్థాయి నివేదిక తో పాటు వినతి పత్రం సమర్పించారు. 
 
ఇప్ప‌టికే ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్ట‌ప‌ర్తి ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరొందింది. భ‌గ‌వాన్ గా వెలుగొందిన పుట్ట‌ప‌ర్తి  సత్యసాయి ప్రాభ‌వంతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చేందింది. అయితే, ఆయ‌న మ‌ర‌ణానంత‌రం కొంత భ‌క్తుల తాకిడి త‌గ్గింది.

ఇక్క‌డి ప్ర‌శాంతి నిల‌యం కేంద్రంగా పుట్ట‌ప‌ర్తి ప్రాంతాన్ని మరింత పర్యాటక కేంద్రంగా, ఇంటర్నేషనల్ టూరిజం డెస్టినేషన్ గా టూరిజం శాఖ తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై స‌మ‌గ్ర నివేదిక‌ను స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు కేంద్ర మంత్రికి అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments