Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడియో పిచ్చి.. కళ్లముందు మనిషి కాలిపోతున్నా పట్టించుకోలేదు.. సజీవంగా?

సెల్ఫీలు, వీడియోల పిచ్చి ప్రస్తుతం బాగా ముదిరిపోతుంది. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మనుషుల్లో మానవత్వం మంట కలిసిపోతోంది. కళ్లముందు తోటి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. అతనిని రక్షించకుండా వీడియో చూసి సోషల

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (15:38 IST)
సెల్ఫీలు, వీడియోల పిచ్చి ప్రస్తుతం బాగా ముదిరిపోతుంది. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మనుషుల్లో మానవత్వం మంట కలిసిపోతోంది. కళ్లముందు తోటి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. అతనిని రక్షించకుండా వీడియో చూసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపైనే చాలామంది దృష్టి పెడుతున్నారు. అలాంటి చేదు ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బీద్‌ జిల్లా ప్రధాన జాతీయ రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని, ఒక బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలైనాయి. ప్రమాదం ధాటికి మరో బైకు నుంచి మంటలు చెలరేగాయి. ఆ బైక్‌పై ఉన్న వ్యక్తి తలకి తీవ్రమైన గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. త‌న‌ శరీరం కాలిపోతున్నా సాయం చేయ‌మ‌ని అడ‌గ‌లేని ప‌రిస్థితిలో ఉన్నాడు. 
 
ఈ ప్ర‌మాద ఘ‌ట‌న అనంత‌రం అత‌డి చుట్టూ చేరిన స్థానికులు, మంటల్లో కాలిపోతోన్న ఆ వ్య‌క్తిని చూస్తూ ఉండిపోయారు. అంతేకాదు, మంట‌ల్లో కాలిపోతోన్న ఆ వ్యక్తిని సినిమా చూస్తున్నట్లు చూస్తూ.. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. దీంతో ఆ వ్య‌క్తి స‌జీవద‌హ‌నం అయ్యాడు. ఇంతలో ఘటనాస్థలానికి పోలీసులు వచ్చారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మందు బాటిల్స్ బైకులపై తీసుకెళ్లడంతోనే మంటలు వ్యాపించాయని పోలీసులు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments