Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాధ్వీ ప్రాచీ వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి భార్య అయినా రావాలి..

హిందూత్వ నాయకురాలు సాధ్వీ ప్రాచి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్‌ తలాక్‌, నిఖాహలాల వంటి దురాచారాల నుంచి తప్పించుకోవాలంటే ముస్లిం మహిళలు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలని కొత్త వివాదానికి తెరలేప

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (18:22 IST)
హిందూత్వ నాయకురాలు సాధ్వీ ప్రాచి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్‌ తలాక్‌, నిఖాహలాల వంటి దురాచారాల నుంచి తప్పించుకోవాలంటే ముస్లిం మహిళలు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలని కొత్త వివాదానికి తెరలేపారు. మథురలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిఖా హలాల, ట్రిపుల్‌ తలాఖ్‌ వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలపై మౌల్వీలు ఫత్వాలు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. 
 
ఇలాంటి అరాచకాలను అరికట్టాలంటే ముస్లిం యువతులు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలంటూ సలహా ఇచ్చారు. నిఖా హలాలాకు వ్యతిరేకంగా పోరాడుతున్న నీదా ఖాన్‌ (బరేలీ) సహా పలువురు ముస్లిం మహిళలతో సమావేశమై, వారందరినీ హిందూ మతంలో చేరాల్సిందిగా కోరతానంటూ సాధ్వి సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
అంతేగాకుండా.. విశ్వ హిందూ పరిషత్‌ నేత సాధ్వీ ప్రాచి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌నాథ్‌ దేవాలయాన్ని దర్శించుకున్న సాధ్వి ప్రాచి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు చురకలంటించారు. ఆ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీకి పెళ్లి కావాలని దేవుడి వద్ద కోరుకున్నానన్నారు. 
 
బాబా గోరఖ్‌నాథ్‌ ఆశీస్సుల కోసం ఇక్కడకొచ్చానని.. కాంగ్రెస్ నేతలు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మెజార్టీని సాధించలేకపోతే, కనీసం రాహుల్‌ గాంధీకి భార్య అయినా రావాలని కోరుకున్నానని సాధ్వి సెటైర్లు విసిరారు.
 
కాగా సాధ్వీ ప్రాచి చేసిన ఈ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అశోక్‌ సింగ్‌ ఘాటుగా స్పందించారు. ''కాంగ్రెస్‌ నేతలపై వ్యాఖ్యలు చేయడం ఇటీవల సర్వసాధారణంగా మారిందని, సాధ్వి అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆమె స్థాయి ఏమిటో తెలియజేస్తోందని అశోక్ సింగ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments