Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంపుడు కుక్కతో వాకింగ్ చేసేందుకు బలవంతంగా క్రీడాకారుల గెంటివేత.. ఐఏఎస్ ఉద్యోగం ఊడింది...

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (08:32 IST)
తమ పెంపుడు కుక్కతో క్రీడా మైదానంలో వాకింగ్ చేసేందుకు ఆ స్టేడియంలోని క్రీడాకారులను బలవంతంగా బయటకు పంపించారు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఘటనపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ ఐఏఎస్ అధికారిణితో బలవంతంగా రాజీనామా చేయించింది. ఆమె పేరు రింకూ దుగ్గా. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇటీవల ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గా క్రీడాకారులను ముందుగానే పంపించివేయడం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా ఈ స్టేడియం సాయంత్రం ఏడు గంటల వరకూ క్రీడాకారులకు అందుబాటులో ఉండాలి. 
 
ఈ క్రమంలో, పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు రింకూ, ఆమె భర్త ఈ మైదానాన్ని వాడుకోవడం ప్రారంభించారు. ఈ జంట ఆదేశాల మేరకు నిర్వాహకులు నిర్ణీత సమయానికంటే ముందే క్రీడాకారులను బయటకు పంపించసాగారు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి. 
 
దీనిపై కేంద్రం కన్నెర్ర జేసింది. ప్రభుత్వ అధికారుల ప్రాథమిక నిబంధనలు, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ గవర్నమెంట్ ఉద్యోగినైనా ముందస్తుగా పదవీ విరమణ చేయమని కోరే హక్కు ప్రభుత్వానికి ఉంది. దీంతో రింకూ తన ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆమె భర్త సంజీవ్ ఖిర్వార్ లద్దాక్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments