భరత గడ్డపై అడుగుపెట్టనున్న అభినందన్... వాఘా బోర్డర్‌ వద్ద భావోద్వేగ వాతావరణం

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (09:49 IST)
భారత భూభాగంలోకి వచ్చిన పాకిస్థాన్ యుద్ధ విమానాలను వెంబడించి, ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేసిన తర్వాత ప్రమాదశాత్తు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో దిగిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భరతమాత గడ్డపై  అడుగుపెట్టనున్నాడు. 
 
తమ వద్ద బందీగా ఉన్న వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేసేందుకు పాకిస్థాన్ గురువారం సమ్మతించిన విషయం తెల్సిందే. అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో పాటు.. భారత దౌత్య నీతికి పాకిస్థాన్ తలొగ్గక తప్పలేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన ఈ ప్రకటనతో భారతదేశం మొత్తం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది.
 
మరోవైపు, అభినందన్ భార్యాపిల్లలు ఢిల్లీలో ఉంటే.. ఆయన తల్లిదండ్రులు మాత్రం చెన్నై తాంబరం ఎయిర్‌ఫోర్స్ క్వార్టర్స్‌లో నివశిస్తోంది. దీంతో తమ బిడ్డను చూసేందుకు అభినందన్ తండ్రి సింహుకుట్టి వర్ధమాన్, తల్లి శోభలు, మరికొంతమంది బంధువులు గురువారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే, పాక్ చెర నుంచి విడుదల కాబోతున్న అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments