Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూలిపోయిన హెలికాఫ్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (11:34 IST)
నీలగిరి జిల్లాలో కూలిపోయిన భారత రక్షణ శాఖకు చెందిన అత్యాధునిక హెలికాఫ్టర్‌ బ్లాక్ బాక్స్‌ను భారత ఎయిర్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని విశ్లేషించేందుకు ఢిల్లీకి తీసుకెళ్లారు. 
 
కాగా, నీలగిరి జిల్లా కాట్టేరి ప్రాంతంలో ఈ హెలికాఫ్టర్ కూలిపోగా, ఇందులో ప్రయాణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌తో సహా ఆయన భార్య మధులిక రావత్, మరో 11 మంది రక్షణ శాఖ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదం నుంచి హెలికాఫ్టర్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. 
 
ఇదిలావుంటే, దేశ వ్యాప్తంగా విషాదం నింపిన హెలికాఫ్టర్ ప్రమాదానికి గల కారణాలను పలువురు విధాలుగా చెబుతున్నారు. అయితే, స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు, రక్షణ రంగ నిపుణులు మాత్రం మరోలా అభిప్రాయపడుతున్నారు. హెలికాఫ్టర్ ప్రమాదం జరిగిన ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతం. పైగా, దట్టంగా పొగమంచు అలుముకునివున్నది. ఈ పొగ మంచే హెలికాఫ్టర్ ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్నది పలువురు అభిప్రాపడుతున్నారు. 
 
ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఊటీ ఉన్న జిల్లా నీలగిరి. ఈ ప్రాంతంలో సాధారణంగానే మంచుదుప్పటి ఉంటుంది. పైగా, మంచుకాలంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇటీవల నీలగిరి జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు తగ్గిపోవడంతో ఇపుడు పొగమంచు కూడా ఎక్కువైంది. ఈ కారణంగానే ఈ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. 
 
ఈ విషయాన్ని స్థానికులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. మరికొద్దిసేపట్లో వెల్లింగ్టన్‌కు చేరుకోవాల్సివున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్, ఆయన అర్థాంగి మధులిక రావత్, మరో 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments