Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్రభుత్వాన్ని విమర్శిస్తే గోళ్లు కత్తిరించేస్తా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్

‘వింత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ దేబ్‌ ఇప్పుడు మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఈసారి ఏకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే గోళ్లు కత్తిరించేస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పోలీస్ దినోత్సవం సందర్భంగా త్రిపుర రాజధాని

Webdunia
బుధవారం, 2 మే 2018 (21:17 IST)
వింత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే  త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ దేబ్‌ ఇప్పుడు మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఈసారి ఏకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే గోళ్లు కత్తిరించేస్తానంటూ షాకింగ్  కామెంట్స్ చేశారు. పోలీస్ దినోత్సవం సందర్భంగా త్రిపుర రాజధాని అగర్తలాలో నిర్వహించిన కార్యక్రమంలో బిప్లబ్‌ మాట్లాడుతూ.. ‘ఎవ్వరూ నా ప్రభుత్వంపై చెయ్యి వేయలేరు. ఎందుకంటే  ప్రభుత్వం నాది కాదు. ప్రజలది. 
 
నా ప్రజలు, ప్రభుత్వంపై చెయ్యి ఎత్తే ధైర్యం చేస్తే గోళ్లు కత్తిరించేస్తా’ అని వ్యాఖ్యానించారు. కూరగాయలు అమ్ముకునే వ్యక్తి వద్ద సొరకాయలు ఉంటే కొనడానికి వచ్చేవారంతా అది బాగానే ఉందా? లేదా? అని పరీక్షించేందుకు గోళ్లతో గిల్లి చూస్తారు. అలా చాలామంది చేయడం వల్ల సొరకాయపై గాట్లు పడి ఎందుకూ పనికి రాకుండా పోతుంది. ఇక దాన్ని ఎవ్వరూ కొనుక్కోరు. సొరకాయ మాదిరిగా నా ప్రభుత్వంపై ఎవ్వరైనా గాట్లు పెడదామని చూస్తే... చూస్తూ ఊరుకోను. వాళ్ల  గోళ్లు కత్తిరించేస్తాను’ అంటూ మరో వివాదంలో ఇరుక్కున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments