Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పెళ్లికి సిద్ధంగా లేను'.. తమిళ టెక్కీ వెబ్ సైట్ ప్రారంభం..!

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (11:45 IST)
సాధారంగా వివాహం చేసుకోవాలని భావించి వెబ్ సైట్లలో వివరాలతో కూడిన ప్రొఫైల్ ఉంచేవారిని మనం చూసుంటాం. అయితే ఓ బెంగుళూరు టెక్కీ తాను అప్పుడే పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేనంటూ ఒక వెబ్ సైట్‌ను ప్రారంభించింది. తమిళనాడుకు చెందిన ఇందుజా పిళ్లై (23) ప్రస్తుతం బెంగళూరులో ఒక సాఫ్ట వేర్ కంపెనీలో పనిచేస్తోంది.
 
తల్లిదండ్రులు పెళ్లిసంబంధాలు చూడటం ప్రారంభించగానే, ఆమె అందరు అమ్మాయిల్లా కాకుండా వినూత్నంగా ఆలోచించింది. 'నా వయసు 23 ఏళ్లు. నేను ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేను. ప్రస్తుతం ప్రపంచం అంటే ఏంటో తెలుసుకుంటున్నా. పెళ్లికి ఇంకా సమయం కావాలి. ఇండియాలో 30 ఏళ్లు దాటితే పెళ్లవదు అని ఎలా కల్పిస్తారో?' అంటూ, తన వివరాలను వెబ్ సైటులో అప్ లోడ్ చేసింది. 
 
కాగా, ఇందుజా వెబ్ సైటుకు నార్త్ ఇండియా నుంచి చాలా కామెంట్లు వస్తుండగా దక్షిణాది నుంచి మాత్రం అంత ఎక్కువ స్పందన రావడంలేదట. ఏది ఏమైనా వివాహానికి సంబంధించి తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు తెలిపి వారిని ఒప్పించేలా చేశానని ఇందుజా సంతోషంగా ఉంది. ఆ వెబ్ సైటును ఇప్పటికే 2 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments