Webdunia - Bharat's app for daily news and videos

Install App

'షమీ విట్నెస్' ఖాతా నాదే... ప్రశ్చాత్తాపం లేదు : ఐఎస్ తీవ్రవాది బిశ్వాస్!

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (10:45 IST)
ఇస్లామిక్ టెర్రరిస్టులకు అనుకూలంగా తాను షమీ విట్నెస్ పేరిట ట్విట్టర్ ఖాతాను నడిపినట్టు ఇటీవల బెంగుళూరులో పట్టుబడిన తీవ్రవాది మెహదీ మస్రూర్ బిశ్వాస్ వెల్లడించారు. 
 
ఇరాక్, సిరియాల్లో మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ తీవ్రవాదులకు అనుంబంధంగా ట్విట్టర్ అకౌంట్‌ను నడుపుతూ పట్టుబడిన మెహదీ మస్రూర్ బిస్వాస్‌ వద్ద పోలీసులు జరిపిన విషయాల్లో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అతనిని గురువారం కోర్టులో హాజరుపరిచారు. 
 
ఈ సందర్భంగా న్యాయవాదితో తీవ్రవాది బిశ్వాస్ మాట్లాడుతూ తానో సైనికుడినని, తాను చేసిన పనికి ఎంతమాత్రం పశ్చాత్తాపడటం లేదని చెప్పుకొచ్చాడు. ‘నేనో సైనికుడిని. మెసెంజర్‌ను కూడా. నేను చేసిన పనికి ఎంతమాత్రం పశ్చాత్తాపడటం లేదు’ అని చెప్పాడు. 
 
బెంగుళూరు కేంద్రంగా పని చేస్తున్న ఓ బహుళ జాతి సంస్థలో మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న అతడు ఐఎస్‌కు అనుకూలంగా ‘షమీ విట్‌నెస్’ పేరిట ట్విట్టర్ ఖాతాను నడిపాడు. ఐఎస్ తీవ్రవాదుల్లో ఆంగ్లం వచ్చిన వారితో సంబంధాలు నెరపడమే కాక అరబిక్‌లోని పలు సందేశాలను అనువదిస్తూ ఉగ్రవాదులకు సహకరించాడు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments