Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మోహన్ ఫస్ట్ కామెంట్స్: తప్పు చేశారో లేదో నాకు తెలుసా?

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (09:55 IST)
తన కేబినెట్‌లో మంత్రి పదవులు పొందిన వ్యక్తులు తమ విధి నిర్వహణలో భాగంగా తప్పు చేశారో లేదో తనకు తెలియదని, కానీ, నేను మాత్రం నా డ్యూటీ చేసినట్టు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. తన కుమార్తె దమన్ సింగ్ రాసిన ‘‘స్ట్రిక్ట్ లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. ఇందులో కాంగ్రెస్ నేతలెవ్వరూ పాల్గొనలేదు ఒక్క శశిథరూర్ మినహా. ఈ సందర్భంగా మన్మోహన్ స్పందిస్తూ.. ‘‘నిజానికి నా విధులు నేను నిర్వర్తించాను. ఇతరులు ఏమి రాశారన్న దానిపై నేనేమీ స్పందించలేను’’ అంటూ రెండంటే రెండు ముక్కల్లో తన స్పందనను వెల్లడించేశారు.
 
నిజానికి ప్రధానిగా తాను తీసుకున్న నిర్ణయాలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై ఆయన ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. అయితే, ఆ ఆరోపణలను ఆయన ఖండించలేదు, అలాగని సమర్థించనూ లేదు. తన డ్యూటీ తాను చేశానని ముక్తాయించారు. అంతేకాక సదరు వ్యక్తులు తనపై చేసిన ఆరోపణల సారాంశం పూర్తిగా తనకు తెలియదని కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. 
 
అలాగే, తండ్రిపై వచ్చిన ఆరోపణలపై కూడా దమన్ సింగ్ కూడా పెద్దగా స్పందించలేదు. ‘‘వాస్తవంగా ఆ విషయం గురించి నాకేమీ తెలియదు. అందువల్ల దానిపై నేనేమీ మాట్లాడలేను. అసలు దానిపై నా వద్ద ఎలాంటి సమాచారం లేదు. వారేమి చెప్పారో నాకు తెలియదు. ఈ కారణంగా నేనేమీ చెప్పలేను. నిజంగా వారేమన్నారో నాకు తెలియదు. కాబట్టి, దానిపై నేను చెప్పేదేమీ లేదు’’ అంటూ వినోద్ రాయ్ వ్యాఖ్యలపై స్పందించాలన్న విలేకరుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments