Webdunia - Bharat's app for daily news and videos

Install App

1990 వరకు నాకు ఆ సామర్థ్యం ఉంది.. ఇపుడు లేదు.. రేప్‌పై గుర్మీత్ సింగ్

డేరా సచ్చా సౌధా ఆశ్రయంలోని ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఈ ఆశ్రమం చీఫ్ గుర్మీత్ సింగ్‌కు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు 20 యేళ్ళ జైలుశిక్ష విధించింది. అయితే, ఈ కేసులో దోషిగా తేలిన తర్వా

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (14:55 IST)
డేరా సచ్చా సౌధా ఆశ్రయంలోని ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఈ ఆశ్రమం చీఫ్ గుర్మీత్ సింగ్‌కు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు 20 యేళ్ళ జైలుశిక్ష విధించింది. అయితే, ఈ కేసులో దోషిగా తేలిన తర్వాత శిక్ష ఖరారు కోసం మరోమారు కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. ఆ సమయంలో జడ్జి వద్ద గుర్మీత్ సింగ్ స్వయంగా తన వాదనలు వినిపించారు. 
 
ఆ సమయంలో తాను 1990 నుంచి నపుంసకుడినని, తనకు లైంగిక‌ సామ‌ర్థ్యం లేద‌ని, శృంగారానికి ప‌నికి రా‌నని, ఇలాంటి పరిస్థితుల్లో తాను ఈ రెండు రేప్‌లు ఎలా చేస్తాన‌ని ప్రశ్నించాడు. ఈ రేప్ కేసు ఆరోపణలు 1999లో రావడంతో తెలివిగా తన వాదన వినిపించాడు. 
 
అయితే విచారణ సందర్భంగా డేరాకు సంబంధించిన ఒక హాస్టల్ వార్డెన్ బాబా చాలా మంచివాడని సాక్ష్యమిస్తూ... ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా డేరా ఆశ్రమంలోని హాస్టల్‌లోనే ఉంటున్నారని, ఆయన అందర్నీ బిడ్డల్లా చూసుకుంటారని సాక్ష్యమిచ్చారు. 
 
దీనిని గుర్తు చేసుకున్న జడ్జి జ‌గ్దీప్ సింగ్.. నువ్వు నపుంసకుడివైతే నీకు ఇద్దరు కుమార్తెలెలా పుట్టారు? అని ప్రశ్నించారు. దీంతో గుర్మీత్ సింగ్ తెల్లమొహం వేశాడు. ఆ తర్వాత గుర్మీత్‌కు ఏకంగా 20 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం