Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాన్స్‌జెండర్‌తో వివాహం... ఆపై కట్నకానుకలు కావాలంటూ వేధింపులు

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (08:31 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కట్నకానుకలు కావాలంటూ చిత్ర హింసలు పెట్టాడు అదీ కూడా ఫేస్‌బుక్‌ పరిచయంతో దగ్గరై ఈ పెళ్లి చేసుకున్నాడు. 
 
హైదరాబాద్, ఎల్బీ నగర్‌లో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎల్బీనగర్‌, శివపురికాలనీకి చెందిన ట్రాన్స్‌జండర్‌ (29)కు 2018లో ఏపీ, వెస్ట్‌ గోదావరి జిల్లా, ఏలూరు మం డలం, సత్రంపాడు, ఎంఎస్‌కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ కావలి తారకమహేశ్‌ (24) ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయ్యాడు. 
 
పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెండ్లి చేసుకుంటానని మహేశ్‌ చె ప్పాడు.. తాను ట్రాన్స్‌ జండర్‌నని ఆమె చెప్పగా.. అయినా పెండ్లి చేసుకుంటానని చెప్పాడు. 
 
ఈ క్రమంలో ఆమె నుంచి రూ.4 లక్షలు తీసుకున్నా డు. అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో ట్రాన్స్‌జండర్‌ను పెండ్లి చేసుకున్నాడు.. కొన్నాళ్ల తర్వాత అదనపు కట్నం కోసం వేధించసాగాడు. 
 
మహేశ్‌.. కుటుంబ సభ్యులు మల్లీశ్వరి, పూజితతో కలిసి ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. వారి వేధింపులు భరించలేక ఆమె తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు వేధింపులకు గురిచేసిన తారక మహేశ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments