Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజురాబాద్ బైపోల్ : 172 పోలింగ్‌ కేంద్రాల్లో కాంగ్రెస్‌కు సింగిల్‌ డిజిట్‌..

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (09:45 IST)
తెలంగాణా రాష్ట్రంలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూసింది. నియోజకవర్గంలోని 306 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 22 రౌండ్లలో ఓట్లు లెక్కించగా కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకటనర్సింగ రావుకు కేవలం 3,012 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 
 
గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 60,604 ఓట్లు పోలవ్వగా ఈసారి ఉప ఎన్నికల్లో కేవలం ఐదు శాతానికి మించలేదు. ఏకంగా 172 పోలింగ్‌ కేంద్రాల్లో సింగిల్‌ డిజిట్‌ ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో 134 పోలింగ్‌ కేంద్రాల్లో 10 కంటే ఎక్కువగా ఓట్లు వచ్చాయి. 71, 72, 107, 281 పోలింగ్‌ కేంద్రాల్లో కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. 
 
కాంగ్రెస్‌ అధిష్టానం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం చేయడం, చివరకు స్థానికేతరుడైన బల్మూరి వెంకటనర్సింగరావును బరిలో దింపటం పార్టీకి ప్రతికూలంగా మారిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
పైగా భాజపా, తెరాస నేతలు హోరాహోరీగా ప్రచారం చేయగా, అదే స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ చేయలేకపోయింది. మొత్తంగా ఉప ఎన్నికల్లో భాజపా, తెరాస మధ్య నువ్వానేనా అన్నట్లు సాగింది తప్ప కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడా పోటీ ఇవ్వలేదు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments