Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైటీ వ్యక్తితో భార్య అక్రమ సంబంధం... నైటీ విప్పి చూసిన భర్తకు షాక్...

మహారాష్ట్రలోని పుణేలో ఓ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాడు. అక్రమ సంబంధంతో స్నేహితుడి భార్యను లొంగదీసుకున్నాడు పదే పదే మహిళ వేషంతో ఇంటికొచ్చేవాడు. ఇలా ఓ రోజు

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (17:07 IST)
మహారాష్ట్రలోని పుణేలో ఓ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాడు. అక్రమ సంబంధంతో స్నేహితుడి భార్యను లొంగదీసుకున్నాడు పదే పదే మహిళ వేషంతో ఇంటికొచ్చేవాడు. ఇలా ఓ రోజు భర్త ఉన్నాడని తెలిసినా.. ఆడ వేషంలో వచ్చి బుక్కైపోయాడు. వివరాల్లోకి వెళితే.. పుణెలోని బిబ్వేవాడి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఓ బంగ్లాలో నివాసముంటున్నాడు. అతనికి మెహతా అనే ఫ్రెండ్ ఉన్నాడు. మెహతా పదేపదే అతని ఇంటికి వెళుతుండేవాడు. అతని లేని సమయంలో కూడా ఇంటికి వెళుతుండేవాడు.
 
ఈ విషయాన్ని సెక్యూరిటీ ఇంటి యజమానికి విషయం చేరవేశాడు. దీంతో తన భార్యకు, మెహతాకు మధ్య అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న ఆ భర్త తన ఇంటికి వస్తే మర్యాదగా ఉండదని మెహతాను అనేక సార్లు హెచ్చరించాడు. అయినా మెహతా వ్యవహార శైలిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇరుగుపొరుగు వారు గమనిస్తున్నారని తెలుసుకుని వేషం మార్చాడు. ఆడదానిలా కనిపించే విధంగా దుస్తులు ధరించేవాడు. ఆమె ఇంటికి వెళ్ళేవాడు. ఇలా వెళ్లే క్రమంలోనే మెహతాకు ఊహించని అనుభవం ఎదురైంది. ఆమె భర్త ఇంట్లో ఉండగా మెహతా వెళ్లాడు. తనతో పాటు తీసుకెళ్లిన మత్తు మందును నిద్రిస్తున్న ఆమె భర్త ముక్కు దగ్గర పెట్టాడు.
 
అయితే ఆ మత్తు మందు విపరీతమైన వాసన రావడంతో అతనికి మెలకువ వచ్చింది. తీరా లేచి చూసేసరికి ముసుగు వేసుకున్న మనిషి కనిపించాడు. మెహతా ఆమె భర్త ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. తప్పించుకుని పారిపోయే క్రమంలో మెహతా నైటీలో ఉన్నాడని తేలిపోయింది. వెంటనే అతడిని పట్టుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరికి క్షణిక సుఖాల కోసం పాకులాడిన అతని జీవితం కటకటాల పాలైంది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు రాజేష్ మెహతాను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments