Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త నిద్రపోయాక.. పత్తి తోటలో ప్రియుడితో ఏకాంతంగా గడిపింది.. అంతే నరికేశాడు..

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తన భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆగ్రహించిన భర్త.. భార్యను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (10:02 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తన భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆగ్రహించిన భర్త.. భార్యను దారుణంగా  హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముమ్మలంపట్టి గ్రామానికి చెందిన హరికృష్ణ రైల్వేలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య తంగమారి, ఓ కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
 
అదే గ్రామానికి చెందిన రైతు పెరుమాల్‌కు తంగమారితో అక్రమ సంబంధం ఏర్పడింది. దీనిపై భర్త, బంధువులు ఎన్నోసార్లు హెచ్చరించినా తంగమారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవల కేరళ వరదల నేపథ్యంలో హరికృష్ణ ఇంటికి వచ్చాడు. అతను రాత్రి నిద్రకు ఉపక్రమిస్తుండగా, భార్య తంగమారి పాలలో మత్తు మాత్రలు కలిపి ఇచ్చింది. దాన్ని తాగినట్లుగా హరికృష్ణ నటించాడు. 
 
భర్త నిద్రలోకి జారుకున్నాడని భావించిన తంగమారి అర్థరాత్రి పెరుమాల్‌కు ఫోన్ చేసి.. ఊరి బయట వున్న పత్తి తోటలో కలిసింది. భార్య ప్రవర్తనతో ఆగ్రహానికి లోనైన హరికృష్ణ వేట కొడవలి తీసుకుని వెంబడించాడు. చివరికి వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా దాడిచేశాడు. ఈ దాడిలో పెరుమాల్ అక్కడికక్కడే చనిపోయాడు.
 
భార్య తంగమారి అక్కడి నుంచి పారిపోతుండగా, హరికృష్ణ వెంటాడి మరీ కొడవలితో నరికాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments