Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను ఎత్తిపొడుస్తూ అవమానించిన భార్య.. సుత్తితో తలపై బాది.. పిల్లలను కూడా..?

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (15:02 IST)
భర్త ఒక హత్య చేసాడని, వాళ్ల కుటుంబమే హంతకుల ఫ్యామిలీ అని అనుమానించిన భార్య.. అతడిని ఎత్తిపొడుస్తూ అవమానించడంతో ఆ భర్త తట్టుకోలేకేపోయాడు.. ఆగ్రహంతో భార్యను సుత్తితో తలపై బాది హతమార్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తామిద్దరం లేకపోతే పిల్లలు అనాధలవుతారని వారిని కూడా అతి దారుణంగా తలలు పగలకొట్టి హతమార్చి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గడ్‌ లో వెలుగు చూసింది.
 
వివరాలలోకి వెళితే.. రాయ్ పూర్ కి చెందిన భాస్కర్ తన భార్య సుప్రీతతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి ఐదేళ్ల కూతురు, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. కలతలు లేని జీవితం, నిత్యం సంతోషంగా ఉండే వీరి జీవితంలోకి అనుమానం ప్రవేశించింది. ఇటీవల భాస్కర్, తన స్నేహితుడితో పాటు కారులో బయటికి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేసరికి స్నేహితుడు కారులోనే శవమై కనిపించాడు. దీంతో ఈ హత్య కేసులో భాస్కర్ కి కూడా సంబంధం ఏమైనా ఉందా అని పోలీసులు అతడిని కూడా విచారణకు పిలిచారు. 
 
పోలీస్ కేసు అంటే ఒక పట్టానా అవ్వదు కాబట్టి విచారణ ముగిసేవరకు భాస్కర్ ఇంటికి పోలీసులు వస్తూ ఉండేవారు. ఇక ఈ నేపథ్యంలోనే భార్యకు, భర్తపై నమ్మకం పోయి అనుమానం మొదలయ్యింది. ఒక వేళ భర్తే తన స్నేహితుడిని హత్య చేసి ఉండొచ్చని అనుకోని అతడిని వేధించడం మొదలుపెట్టింది. 
 
భర్త అన్న ఆమె బార్యను చంపి జైలుకు వెళ్లడంతో ఆ ఘటనను ఉదాహరణగా తీసుకొని రోజూ భాస్కర్ ని వేధించేది. దీంతో భార్య వేధింపులు తట్టుకోలేని భాస్కర్, ఒక పెద్ద సుత్తితో భార్య తలా పగలకొట్టి హతమార్చాడు. అనంతరం తన బిల్డింగ్ లోని ఆరవ అంతస్తు నుంచి దూకేశాడు.ఇది గమనించిన వాచ్ మెన్ హుటాహుటిన వారి ఇంటికి వెళ్లి చూడగా.. ఘోరమైన సన్నివేశాలు కనిపించాయి. భార్య, ఇద్దరు పిల్లల తలలు సుత్తితో పగలగొట్టడంతో రక్తపు మడుగులో విగతజీవులుగా దర్శనమిచ్చారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా భార్య కొనఊపిరితో ఉందని గ్రహించి ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం భాస్కర్ రాసిన సూసైడ్ నోట్ ని స్వాధీనం చేసుకున్నారు. తన భార్య వేధింపులు తట్టుకోలేక ఈ దారుణానికి ఒడిగట్టానని, మేమిద్దరం లేకపోతే పిల్లలు అనాధలవుతారని వారిని కూడా హతమార్చినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటన రాయ్ పూర్ లో సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments