Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొడతావా? నువ్వేం మనిషివి..? సుప్రీం కోర్టు ఫైర్

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (13:32 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మహిళల భద్రతపై సీరియస్ అయ్యింది. అత్తారింట్లో కుటుంబ సభ్యులు, బంధువులు కొట్టడం వల్ల భార్యకు గాయాలైనా దానికి భర్తదే బాధ్యత అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. 
 
తన భార్యకు తగిలిన గాయాలకు తాను కారణం కాదని, తన తండ్రి వల్లే అలా జరిగిందని, తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు మాత్రం అతని వాదనను తోసిపుచ్చింది. అత్తారింట్లో తన బంధువుల వల్ల భార్యకు గాయాలు తగిలినా కూడా అందుకు ప్రధాన బాధ్యత మాత్రం భర్తదే అని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.
 
కాగా.. గతేడాది జూన్‌లో లుధియానాకు చెందిన ఓ మహిళ తనను భర్త సహా అత్తింటి వారు హింసిస్తున్నారని, తీవ్రంగా కొట్టారని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. దీనిపై తనను అరెస్ట్ చేయకుండా కాపాడాలంటూ ఆ భర్త పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు వెళ్లగా అక్కడ చుక్కెదురవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డేతో కూడిన ధర్మాసనం ఆ భర్తపై తీవ్రంగా మండిపడింది. 
 
భార్యను చంపడానికి ప్రయత్నిస్తుంటే చూస్తూ నిలబడ్డ వాడివి.. మనిషేనా అంటూ ఫైర్ అయ్యింది. భార్యను కొట్టడం వల్ల తనకు గర్భస్రావం అయిందని చెప్పింది. భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొడతావా? నువ్వేం మనిషివి అని ధర్మాసనం సీరియస్ అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments