Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగి నో చెబితే ఐసీయూలో అడ్మిట్ చేయొద్దు : కేంద్ర కొత్త మార్గదర్శకాలు

Webdunia
బుధవారం, 3 జనవరి 2024 (10:23 IST)
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఒక రోగిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేరుకునే విషయంపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 24 మందితో కూడిన నిపుణుల వైద్య బృందం రూపొందించిన ఈ మార్గదర్శకాలను తాజాగా వెల్లడించింది. ఇందులో రోగిని ఐసీయూలో చేర్చుకునే విషయంలో ఓ క్లారిటీ ఇచ్చింది. రోగి లేదా రోగి బంధువులు అడ్డు చెబితే రోగిని ఐసీయూలో చేర్చుకోవడానికి వీల్లేదని పేర్కొంది. ఈ వైద్య బృందం రూపొందించిన మార్గదర్శకాల్లోని కీలక పాయింట్లను పరిశీలిస్తే, 
 
* ఐసీయూ చికిత్స వద్దనుకునేవారు లివింగ్ విల్‌ను రాతపూర్వకంగా తెలియజేస్తే ఆ విభాగంలో చేర్చుకోరాదు. 
 
* వ్యాధి లేదా అనారోగ్యంతో మరణం అంచులకు చేరినవారి ఆరోరగ్యం ఏమాత్రం మెరుగుపడే అవకాశం లేనపుడు వారిని ఐసీయూలో ఉంచడం ఉపయోగం లేదు. 
 
* ఐసీయూ కోసం ఎదురుచూస్తున్న రోగులు రక్తపోటు, శ్వాసరేటు, హృదయ స్పందన, శ్వాసతీరు, ఆక్సిజన్ శాచురేషన్, మూత్రపరిమాణం, నాడీ వ్యవస్థ పనితీరు వంటి అంశాలను పరిశీలించి ఐసీయూలో చేర్చుకోవడంపై నిర్ణయం తీసుకోవాలి. 
 
* గుండె లేదా శ్వాసకోశ వ్యవస్థ పనితీరులో సమస్యలు ఉన్న రోగులను ఐసీయూల్లో చేర్చుకోవడానికి కారణాలను పరిగణించాలి. 
 
* తీవ్ర అనారోగ్యం కారణంగా నిశిత పర్యవేక్షణ అవసరమైన రోగులు, అవయవ వైఫల్యం, ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశమున్న వ్యాధులతో బాధపడేవారిని ఐసీయూల్లో చేర్చుకోవాలి. 
 
* మహమ్మారులు, విపత్తుల సమయంలో వనరుల పరిమితి ఆధారంగా రోగులను ఐసీయూల్లో ఉంచే అశంపై నిర్ణయం తీసుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments