Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగా, యమునా నదుల్లో 2వేల శవాలు.. నదుల్లో పెట్రోలింగ్..

Webdunia
సోమవారం, 17 మే 2021 (11:02 IST)
బీహార్‌, యూపీలోని గంగా, యమునా నదుల్లో సుమారు కిలోమీటరు మేర శవాలు గంగలో తేలియాడుతునే ఉన్నాయి. ఇలా గంగలో తేలియాడుతున్న మొత్తం శవాలను 2000 వరకు పోలీసులు గుర్తించారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. కుప్పలుగా శవాలను పూడ్చిపెట్టకుండా చర్యలు చేపట్టాలని కేంద్రం యూపి, బిహార్ రాష్ట్రాలకు సూచించింది. నదీ ఒడ్డున పూడ్చి వేతలను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
 
అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా..రెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా మరణాలు ...ఎక్కడ చూసిన ఆర్తనాదాలు, చనిపోయిన శవాలు, ఇలా కరోనా తో చనిపోతే కనీసం దగ్గరకు రాని పరిస్థితి నెలకొంది. ఇక అనాధాలు , దీనావస్థలో ఉన్న వారి పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కరోనాతో చనిపోయిన శవాలను కనీసం కాల్చాడినికి కూడ అవకాశం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే యూపీ, బీహార్‌ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో శవాలను కాల్చకుండానే నదిలో విసిరి వేస్తుండగా మరికొంతమందిని మాత్రం నది ఒడ్డున పూడ్చిపెడుతున్నారు.
 
ముఖ్యంగా బీహార్‌లోని నదీ ఒడ్డున ఉన్న జిల్లాల్లో కిలోమీటరు మేర కుప్పుకుప్పలుగా ఒడ్డుపైకి తేలియాడుతూ ఉన్న శవాలను అటు బీహార్, ఇటు యూపి పోలీసులు గుర్తించారు. ఇందులో కొన్ని మృత దేహాలు ఒడ్డుకు కొట్టుకురావడంతో కుక్కలు సైతం పీక్కుతింటున్నాయి. దీంతో స్థానికుల్లో మరింత ఆందోళన చెలరేగుతోంది. వీటివల్ల కరోనా మరింత విజృంభించే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన చేపట్టారు. 
 
మరోవైపు నది నీళ్లను తాగుతున్న పట్టణ ప్రజలు సైతం అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే నది నీళ్లను పూర్తిగా ఫిల్టర్ చేయడం ద్వారనే తాగడం వల్ల ఎలాంటీ ఇబ్బంది ఉండదని స్థానిక అధికారులు వెల్లడించారు.
 
ఇక యూపీలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. యూపీలోని హమీపూర్ జిల్లాలో పారుతున్న యమునా నదిలో కూడ శవాలు తేలుతున్నాయి. ముఖ్యంగా హమిపూర్‌, కాన్పూర్ జిల్లాల్లో కరోనా మృతులు పెరుగుతుండడంతో శ్మశానాలు కిటకిటలాడుతున్నాయి. దీంతో కొంతమంది శవాలను నదిలో వదిలో వేస్తున్నారు. మరోవైపు గుర్తు తెలియని శవాలను కూడ అధికారులు నదిలో పారవేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
 
మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంగా నదిలో కోవిడ్ అనుమానిత రోగుల మృతదేహాలను వదులుతున్న నేపథ్యంలో నదిలో పోలీసులు పెట్రోలింగ్ పెంచారు. మృతదేహాలు నదిలో వదిలేయకుండా, నది తీర ప్రాంతాల్లో ఇసుకలో పూడ్చకుండా వారి అంత్యక్రియల కోసం రూ.5వేల రూపాయలు ఇవ్వాలని యూపీ సర్కారు నిర్ణయించింది. బలియా జిల్లాలో గంగా నదిలో మృతదేహాలు కుళ్లి పోయి తేలుతూ కనిపించాయి. గంగా నదిలో మృతదేహాలు విసిరేయకుండా పెట్రోలింగ్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.
 
మృతదేహాలను ఎవరూ నదిలో విసిరేయరాదని పోలీసులు నదీ తీరప్రాంత గ్రామాల్లో ప్రచారం సాగిస్తున్నారు.మృతదేహాలు నదుల్లో పారవేయకుండా 9 పోలీసు బృందాలతో నదీ తీర ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేశామని బలియా ఎస్పీ విపిన్ తడా చెప్పారు. గంగా, యమునా నదుల సంగమం వద్ద ప్రయాగరాజ్ నగరంలోని రెండు ఘాట్లలో ఇసుక తీరాల్లో ఖననం చేసిన మృతదేహాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. కలప ధరలు పెరగడంతో మృతదేహాలను దహనం చేయకుండా ఇసుకలో ఖననం చేస్తున్నారని స్థానికులు చెప్పారు. దీంతో అంత్యక్రియల కోసం ప్రభుత్వం రూ.5వేలు ఇవ్వాలని నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments