Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేరా బాబా సామ్రాజ్యంపై కన్నేసిన హనీప్రీత్... ఆయనతో బిడ్డని కని, భావిచీఫ్‌ని చేయాలని ఎత్తు

డేరా బాబా సామ్రాజ్యంపై కన్నేసిన హనీప్రీత్... ఆయనతో బిడ్డని కని, భావిచీఫ్‌ని చేయాలని ఎత్తు

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (09:16 IST)
హర్యానా రాష్ట్రం, సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రాం రహీమ్‌ సామ్రాజ్యంపై ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ కన్నేసింది. ఇందుకోసం ఆయనతో బిడ్డనుకని భావి చీఫ్‌ను చేయాలని ఎత్తుగడ వేసింది. అయితే, రేప్ కేసులో డేరా బాబాకు జైలుశిక్ష పడటంతో తన ప్లాన్ వికటించింది. 
 
రేప్ కేసులో జైలుపాలైన తర్వాత డేరా బాబా వారసురాలిగా హనీప్రీత్‌ పేరు తెరపైకి వచ్చింది. అయితే, డేరాను గుర్మీత్‌ నడుపుతున్న కాలంలోనే ఆయన సామ్రాజ్యంపై హనీప్రీత్‌ కన్నేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. గుర్మీత్‌ ద్వారా సంతానం పొందాలని, ఆ బిడ్డను భావి డేరా చీఫ్‌ని చేయాలని ఆమె ఎత్తువేసినట్టు డేరా మాజీ భక్తులు కట్టా సింగ్‌, అతని కుమారుడు గురుదాస్‌ సింగ్‌, గురుదాస్‌ సింగ్‌ తోర్‌ బయటపెట్టారు. 
 
కట్టాసింగ్‌, గురుదాస్‌ సింగ్‌లు గుర్మీత్‌ వద్ద డ్రైవర్లుగా పనిచేయగా, తోర్‌ ప్రస్తుతం సీబీఐకి కీలక వివరాలను అందిస్తున్నాడు. వారి కథనం ప్రకారం, గుర్మీత్‌ చేతుల్లో అత్యాచారానికి గురైనవారిలో హనీప్రీత్‌ ఒకరు. అప్పటినుంచి గుర్మీత్‌కి ఆమె బాగా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. గుర్మీత్‌ ద్వారా సంతానాన్ని పొందాలని ఆమె కోరుకొంది.
 
అందుకు అతడూ అంగీకరించాడు. తమకు కలిగే బిడ్డను డేరా చీఫ్‌ని చేయడానికీ అంగీకరించాడు. నిజానికి, 2007లో తన వారసుడిగా జస్మిత్‌ని గుర్మీత్‌ ప్రకటించాడు. ఆ నిర్ణయాన్ని మార్చుకొనేలా హనీప్రీత్‌ అతనిపై ఒత్తిడి తీసుకురాగలిగింది. తమకు కలిగే బిడ్డని హనీప్రీత్‌ మాజీ భర్త విశ్వాస్‌ గుప్తా సంతానంగా రికార్డుల్లో చూపించాలని తొలుత భావించారు. అయితే, హనీప్రీత్‌కు గుప్తా విడాకులు ఇవ్వడంతో, ఆ ఎత్తు పారలేదు. ఇంతలో గుర్మీత్‌ జైలుపాలు కావడంతో, కథ అడ్డం తిరిగిందని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments