Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ ప్రజలకు ప్రధాని మోడీ హోలీ శుభాకాంక్షలు

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (08:56 IST)
దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు. ‘మీ అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఉల్లాసం తీసుకురావాలి, కొత్త శక్తిని నింపాలి’ అని ట్వీట్‌ చేశారు.
 
కాగా, దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తిని నిలువరించడానికి చాలా రాష్ట్రాల్లో హోలీ వేడుకలపై ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడటంపై నిషేధం అమలులో ఉన్నది. కాగా, ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 62 వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 5 లక్షలకు సమీపంలో ఉన్నది. 
 
మరోవైపు, పాకిస్థాన్‌లోని ఒక ప్రాచీన శివాలయానికి చెందిన సెక్యూరిటీ సిబ్బందిపై అక్కడి హిందూ సముదాయానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
హోలీ వేళ ఆలయంలో దర్శనానికి, పూజలు చేసేందుకు ఆ సెక్యూరిటీ సిబ్బంది తమను అనుమతించలేదని వారు ఆరోపించారు. మన్‌షెరా జిల్లాలోని గంధియాన్ పరిధిలో గల ఈ ఆలయానికి చెందిన సెక్యూరిటీ సిబ్బందిపై శ్యామ్ లాల్, సజ్జన్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను ఆలయంలోకి రానివ్వకుండా చేయడం చట్టవ్యతిరేకమని వారు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments