Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్ఐవి వచ్చినా బుద్ధి గడ్డి తిని.. కన్న కూతురిపైనే అత్యాచారం..!

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (00:58 IST)
హెచ్ఐవి వచ్చినా బుద్ధి గడ్డి తిని.. కన్న కూతురిపైనే అత్యాచారం చేశాడో ప్రబుద్ధుడు. తద్వారా సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుడైన ఓ తండ్రి. తనకు ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్ ఉన్నప్పటికీ ఆ తండ్రి బుద్ధి మారలేదు. కన్న కూతురిపై మూడేళ్ళుగా అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సూరత్‌లోని సచిన్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. బాధితురాలు, ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
పోలీస్ ఇనస్పెక్టర్ పి.బి. సాప్రా కథనం ప్రకారం... 42 ఏళ్ల హెచ్.ఐ.వి పాజిటివ్ వ్యక్తి ఇప్పటికే రెండు సార్లు వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు పుట్టిన కూతురిపై మూడేళ్ళుగా అత్యాచారం చేస్తున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తూ ఉండటంతో ఇప్పటివరకూ ఆ బాలిక తన బాధను ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. చివరికి తన తల్లితో కలసి ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వచ్చింది. 
 
తనకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నపుడు తొలిసారి అత్యాచారం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments