Webdunia - Bharat's app for daily news and videos

Install App

దినకరన్‌కు పార్టీ పదవి... చీలిక దిశగా అన్నాడీఎంకే ... పన్నీర్ సారథ్యంలో అమ్మ డీఎంకే

అన్నాడీఎంకే అడుగులు చీలిక దిశగా పడుతున్నాయి. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్ నేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో అన్నాడ

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (13:01 IST)
అన్నాడీఎంకే అడుగులు చీలిక దిశగా పడుతున్నాయి. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్ నేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో అన్నాడీఎంకే ఆధిపత్య, అధికార పోరు తారా స్థాయికి చేరుకున్న విషయంతెల్సిందే. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోయారు. 
 
కాగా, అన్నాడీఎంకేను డీఎంకే నుంచి వైదొలిగిన ఎంజీఆర్ 1972లో స్థాపించారు. ఆయన మరణించిన తర్వాత కూడా దిగ్విజయంగా కొనసాగింది. దివంగత జయలలిత దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు పార్టీని ఏకఛత్రాధిపత్యంగా నడిపించారు. అలాంటి అన్నాడీఎంకే ఇప్పుడు చీలిక దిశగా అడుగులు వేస్తోంది. తనకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో, సీఎం అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామిని శశికళ ప్రతిపాదించడం పార్టీలో చాలా మందికి నచ్చడం లేదు.
 
పళనిస్వామిపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యక్తిని సీఎంగా చేస్తే, పార్టీ పరువు పోతుందని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు సమాచారం. అమ్మకు అత్యంత విధేయుడు, మచ్చలేని మనిషి పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందని కొంతమంది ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
 
దీంతో పాటు.. జయలలిత పోయెస్ గార్డెన్‌తో పాటు... పార్టీ నుంచి గెంటేసిన వారందరినీ తన బంధువులకు... పార్టీలో కీలక పదవులను శశికళ కట్టబెట్టడం చాలా మందికి మింగుడు పడటం లేదు. పోయస్ గార్డెన్ నుంచి జయ తరిమేసిన తన మేనల్లుడు టిటివి.దినకరన్‌కు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ కట్టబెట్టారు. ఇది చాలా మందికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలిపోనుందనే సంకేతాలు అందుతున్నాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments