Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు ఏక్‌నాథ్ ఖాడ్సే రాజీనామా: దావూద్‌తో సంబంధాలు రుజువైతే..?!

Webdunia
ఆదివారం, 5 జూన్ 2016 (10:58 IST)
మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖాడ్సే ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏక్‌నాథ్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ బీష్మించుకు కూర్చున్న మంత్రిగారు పెద్దల జోక్యంతో పదవి నుంచి తప్పుకున్నారు. 
 
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను శనివారం కలిసిన ఖాడే తన రాజీనామా లేఖను అందజేశారు. రాజీనామా చేసిన అనంతరం ఖాడ్సే మీడియాతో మాట్లాడారు. 'దావూద్‌ ఇబ్రహీంతో ఫోన్‌లో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. బీజేపీని అప్రతిష్టపాలు చేసే కుట్రలో భాగమే ఇది. నేను తప్పుచేసినట్టు ఎవరైనాసరే రుజువులు చూపిస్తే... రాజకీయాల నుంచి తప్పుకుంటాను' అని ఖాడ్సే వ్యాఖ్యానించారు. 
 
అక్రమ భూకేటాయింపులలో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణలు, దావూద్‌ ఇబ్రహీం ఫోన్‌ రికార్డులలో కూడా ఖడ్సే నెంబరు ఉందని ఒక హ్యాకర్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments