Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీని స్థాపించనున్న ప్రవీణ్ తొగాడియా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (13:33 IST)
విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించనున్నారు. ఈ పార్టీ తరపున వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దించనున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ సీట్లలో తమ పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు.
 
ఇదే అంశంపై ఆయన జోధ్‌పూర్‌లో మాట్లాడుతూ, నెల రోజుల వ్యవధిలో రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు తెలిపారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందన్నారు. ముఖ్యంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందన్నారు. 
 
అందుకే ప్రత్యామ్నాయం కావాల్సివుందన్నారు. అన్ని రంగాల్లో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు విఫలమైందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, రైతులు, కార్మికలు, కర్షకులు, యువత, వ్యాపారులకు మోడీ సర్కారు విధానాలు ప్రతిబంధకాలుగా మారాయని ఆరోపించారు. 
 
అందుకే తాము కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ పార్టీ తరపున అభ్యర్థులను అన్ని స్థానాల్లో బరిలోకి దించుతామన్నారు. తమ పార్టీ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments