Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసాధారణ తీవ్ర తుఫాను - వచ్చే 12 గంటల్లో అతితీవ్ర రూపం

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (08:56 IST)
అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన తీవ్ర తుఫాను 'బిపోర్‌ జాయ్‌' మరో 12 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చి అసాధారణ అతి తీవ్ర తుఫానుగా మారనుందని శనివారం భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది 24 గంటల్లో ఉత్తర - ఈశాన్య దిశగా కదులుతుందని వెల్లడించింది. 
 
వాతావరణశాఖ వివరాల ప్రకారం.. వచ్చే 3 రోజుల్లో ఉత్తర - ఉత్తర - పశ్చిమ దిశగా తుఫాను కదులుతుంది. ప్రస్తుతం అది గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. పోర్‌బందర్‌కు 200-300 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోతుంది. 
 
ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఈ తుఫాను గుజరాత్‌ను తాకకపోవచ్చని, కానీ, రానున్న 5 రోజుల్లో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. వచ్చే 5 రోజులూ అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. 
 
తుఫాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లోని తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడతాయి. బలమైన ఈదురు గాలులూ వీస్తాయి. భారీ అలల కారణంగా గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం తితాల్‌ బీచ్‌ను ఈ నెల 14 వరకూ మూసివేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. 
 
తఫానను కారణంగా సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. పోర్‌బందర్‌, గిర్‌, సోమనాథ్‌, వల్సాద్‌లకు జాతీయ విపత్తు దళ బృందాలను అధికారులు పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments