Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్‌లో దారుణం : తల లేని మొండెం... తంత్రాల నెపంతో బలిచ్చారా?

పశ్చిమ్‌ బంగాలోని ఉత్తర మిడ్నాపూర్‌లో దారుణం జరిగింది. ఆ ఊరిలో క్షుద్రపూజలు నిర్వహించిన దుండగులు.. ఇద్దరు మహిళలను బలిచ్చారు. మహిళల మొండెంను గుర్తించిన స్థానికులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించా

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (15:45 IST)
పశ్చిమ్‌ బంగాలోని ఉత్తర మిడ్నాపూర్‌లో దారుణం జరిగింది. ఆ ఊరిలో క్షుద్రపూజలు నిర్వహించిన దుండగులు.. ఇద్దరు మహిళలను బలిచ్చారు. మహిళల మొండెంను గుర్తించిన స్థానికులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంలో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మహిళల మొండెంతో పాటుగా నిమ్మకాయలు, కుంకుమ, పసులు, నువ్వులు, ఇనుప మేకులు పడి ఉన్నాయి. గత శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే తమ్లక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ తమలపాకుల తోటలో గత శనివారం రక్తపు మడుగులో ఉన్న ఓ యువతి తలలేని మృతదేహాన్నిస్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 2 గంటల తర్వాత నందిగ్రామ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అడవిలో పొదల వద్ద మరో మహిళ మృతదేహం కన్పించడంతో కలకలం రేగింది. ఆ మృతదేహానికీ తల లేకపోవడంతో ఈ రెండు హత్యలకు సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
కాగా ఓ మృతదేహం వద్ద కుంకుమ, అగర్‌బత్తీలు, పూలు తదితర సామాగ్రిని పోలీసులు గుర్తించారు. దీంతో తంత్రాల నెపంతో వీరిని బలిచ్చి ఉంటారని అంటున్నారు. అయితే మృతదేహాలు దొరికిన చోటే వీరిని చంపేశారా.. లేదా మరోచోట చంపేసి ఇక్కడ పడేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. మహిళ వివరాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments