Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లారేసరికి ఇంటిపై రూ. 40 లక్షల మూట, అది చూసిన అతడు ఏం చేసాడంటే?

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (22:26 IST)
డబ్బుకు లోకం దాసోహం అన్నారు పెద్దలు. పచ్చనోటు కనబడితే నొక్కేయాలని చాలామంది చూస్తుంటారు. ధనానికున్న పవర్ అది. ఐతే తెల్లారి లేచిన అతడికి తన ఇంటి పైకప్పుపై రెండు బ్యాగులు కనిపించాయి. వాటిని తెరిచి చూస్తే నోట్ల కట్టలు, బంగారం వుంది. అంతే... వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ మీరట్‌లో నివాసం వుంటున్న వరుణ్ శర్మ బుధవారం పొద్దునే లేచి ఇంటి బయటకు వచ్చి పైకి చూడగానే తన ఇంటిపైకప్పుపై రెండు బ్యాగులు కనిపించాయి. అవి ఏంటా అని కిందికి దింపి చూస్తే అందులో డబ్బు నోట్ల కట్టలు, బంగారం వున్నాయి. సహజంగా ఇలా డబ్బు కనబడితే ఎవరైనా కాస్తోకూస్తో నొక్కేయాలని చూస్తారు.
 
కానీ అతడు మాత్రం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, శర్మ ఇంటికి ఆనుకుని వున్న భవనం నుంచి ఈ బ్యాగులు పడవేసినట్లు తేల్చారు. ఆ ఇంట్లో దొంగతనం చేసి, ఇంటికి అమర్చిన సిసి కెమేరాలకు కనబడకుండా వుండేందుకు ఇలా బ్యాగులను విసిరేసినట్లు తేల్చారు. ఈ పని చేసింది ఆ ఇంటికి సెక్యూరిటీగా వుండే నేపాల్ వ్యక్తి అని ప్రాధమిక విచారణలో తేలింది. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments