Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై మహిళలకు సేఫ్ కాదు.. కారులో ఫాలో చేసి.. రాత్రి 2 గంటలకు తలుపుతట్టాడు.. (video)

దేశ వాణిజ్య నగరం ముంబైలో అర్థరాత్రి ఓ మహిళ తీవ్ర వేధింపులకు గురైంది. బాధితురాలు తన ఫేస్‌బుక్ పేజ్‌లో తాను ఎదుర్కొన్న వేధింపులపై స్పందించింది. వివరాల్లోకి వెళ్తే... ముంబైలో అదితి నాగ్ పాల్ అనే యువతి ఫ్

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (08:43 IST)
దేశ వాణిజ్య నగరం ముంబైలో అర్థరాత్రి ఓ మహిళ తీవ్ర వేధింపులకు గురైంది. బాధితురాలు తన ఫేస్‌బుక్ పేజ్‌లో తాను ఎదుర్కొన్న వేధింపులపై స్పందించింది. వివరాల్లోకి వెళ్తే... ముంబైలో అదితి నాగ్ పాల్ అనే యువతి ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తోంది. పదేళ్ల పాటు ఆమె ముంబైలో వుంటోంది. 
 
ఈ నేపథ్యంలో నాగ్ పాల్ తన స్నేహితురాలు, తన ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్తుండగా, కారులో ఒక వ్యక్తి వెంబడించాడు. అంతేగాకుండా.. రాత్రి 2 గంటల ప్రాంతంలో వారి ఇంటికి చేరుకుని కాలింగ్ బెల్ కూడా కొట్టాడు. అయితే డోర్ దగ్గరున్న సీసీటీవీ కెమెరాను చూసి నెమ్మదిగా దూరం వెళ్లి తచ్చాడి వెనుదిరిగాడు. 
 
రాఖీ పండుగ రోజు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రాఖీ పండుగను జన్మలో మర్చిపోలేనని ఫేస్ బుక్ పేజీలో నాగ్ పాల్ తెలిపింది. ముంబై కూడా మహిళలకు సురక్షితమైన ప్రదేశం కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
సీసీ పుటేజ్‌తో ఆధారంతో నాగ్ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేధింపులకు పాల్పడిన వ్యక్తి నితేశ్‌ కుమార్‌ శర్మ (36) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతనిని అరెస్టు చేసిన వీడియోను కూడా నాగ్ పాల్ తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్టు చేశారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments