Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను వేధించగా మా నాన్న కేసు పెట్టారు.. అందుకే కాల్చి చంపారు ...

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (16:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని కాల్చిచంపారు. ఈ దారుణం హత్రాస్‌‍లో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నౌజర్‌పుర్‌ గ్రామానికి చెందిన గౌరవ్‌శర్మ అనే వ్యక్తితోపాటు మరికొందరు అదే ప్రాంతానికి చెందిన అమ్రిశ్ కుమార్ వర్మ అనే రైతు కుమార్తెను కుమార్తెను వేధించసాగారు. దీంతో వారిపై ఆ రైతు కేసుపెట్టారు. ఈ కేసు గత 2018లో నమోదైంది.
 
అయితే కేసు వెనక్కి తీసుకోవాలంటూ గౌరవ్‌శర్మ సహా మిగతావారు రైతును బెదిరించారు. అయినప్పటికీ అమ్రిశ్‌ కుమార్‌ వర్మ కేసు వెనక్కి తీసుకోలేదు. దీంతో అతడిపై కోపం పెంచుకున్న దుండగులు రైతు పొలం వద్ద పనిచేస్తుండగా తుపాకులతో కాల్చి హత్య చేశారు. 
 
ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను 24 గంటల్లోగా పట్టుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడైన గౌరవ్‌ శర్మ సహా మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ దారుణానికి ఏడుగురు పాల్పడినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments