Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

ఠాగూర్
ఆదివారం, 19 మే 2024 (10:05 IST)
అనేక మంది మహిళలపై లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై అరెస్టు వారెంట్‌ జారీ అయ్యింది. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం శనివారం వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరు కాకపోవటంతో అధికారులు కోర్టును ఆశ్రయించారు.
 
మూడు వారాలుగా పరారీలో ఉన్న ప్రజ్వల్‌ జర్మనీ నుంచి లండన్‌కు రైల్లో వెళ్లాడని సిట్‌ ధ్రువీకరించుకుంది. ఇప్పటికే పలుసార్లు భారత్‌కు టికెట్లు బుక్‌ చేసుకొని రద్దు చేసుకున్నట్లు గుర్తించింది. దీంతో చేసేది లేక కోర్టును ఆశ్రయించి సిట్‌ అరెస్టు వారెంటును జారీ చేసింది. ఇప్పటికే ప్రజ్వల్‌పై ఇంటర్‌పోల్‌ బ్లూ కార్నర్ నోటీసు జారీ అయిన విషయం తెలిసిందే. ఆయన్ని మరింత కట్టడి చేసేందుకు బ్యాంక్‌ ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు.
 
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌ తండ్రి హెచ్‌.డి.రేవణ్ణ ప్రస్తుతం బెయిల్‌పై బయటకొచ్చారు. అంతకుముందు ఆయన ఏడు రోజులు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. దోషిగా తేలితే ప్రజ్వల్‌పై చర్యలకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవేగౌడ శనివారం స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం