Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఆఫీసులో మద్యం సేవించవచ్చు..

Webdunia
సోమవారం, 15 మే 2023 (09:02 IST)
హర్యానా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఆఫీసులో మద్యం సేవించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, హర్యానా రాష్ట్రంలోని కార్పొరేట్ ఉద్యోగులకు మాత్రం ఇప్పుడీ అవకాశం వచ్చేసింది. ఇక నుంచి అక్కడి కార్పొరేట్ ఉద్యోగులు ఆఫీసులోనే సరదాగా తమ సహచర ఉద్యోగులతో కలిసి చీర్స్ చెప్పి పెగ్గుల మీద పెగ్గులు లాగించొచ్చు! 
 
తక్కువ మోతాదు ఆల్కహాల్ ఉండే బీర్, వైన్ వంటి డ్రింకులను కార్యాలయాల్లోకి అనుమతిస్తూ హర్యానా సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా 2023-24 సంవత్సరానికిగానూ రూపొందించిన లిక్కర్ పాలసీలో కీలక మార్పులు చేసింది. అలా అని అన్ని ఆఫీసుల్లోనూ మద్యానికి అనుమతి ఉండదు. 
 
ఆఫీసులో కనీసం 5 వేల మంది ఉద్యోగులు ఉండాలి. అంతేనా.. లక్ష చదరపుటడుగుల విస్తీర్ణానికి తక్కువ కాకుండా కార్యాలయ ప్రాంగణం ఉండాలి. అలాగే కనీసం  రెండు వేల ఫీట్లతో క్యాంటిన్ తప్పనిసరి. ఇవన్నీవుండి.. రూ.10 లక్షల వార్షిక ఫీజు కడితేనే సదరు యాజమాన్యానికి తమ కార్యాలయంలో మద్యాన్ని అందుబాటులో ఉంచుకునేందుకు లైసెన్స్ ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments