Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నం కోరిన వరుడు.. 75 పైసలు జరిమానా విధించిన పంచాయతీ...!

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2015 (15:27 IST)
ఆధునిక యుగంలో కోర్టులు, న్యాయవ్యవస్థ ఎంత బలిష్టమైనప్పటికీ కొన్ని ప్రాంతాలలో పంచాయతీ తీర్పే శాసనంగా మారుతుంటుంది. అటువంటి పంచాయతీ పెద్దలు తమకు అనుకూలమైన రీతిలో తీర్పును ఇస్తుంటారు. తాజాగా హర్యానా రాష్ట్రంలోని పంచాయతీ పెద్దలు కట్నం కోరిన వరుడికి 75 పైసలు జరిమానా విధించారు. 
 
హర్యానాలోని, ఫతేహాబాద్‌లో చోటు చేసుకుని ఆ సంఘటన పంచాయితీ వ్యవస్థల పనితీరుపై తీవ్ర ఆరోపణలను లేవనెత్తుతోంది. వివరాల్లోకి వెళితే, అడిగినంత కట్న కానుకలు ఇవ్వలేదన్న కోపంతో మగ పెళ్లివారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోగా, వధువు తరపు బంధువులు పంచాయితీ పెట్టారు. పెళ్ళికి ముందు వరుడికి కారు ఇవ్వాలని డిమాండ్ చేయగా, అందుకు వధువు తరపు పెద్దలు అంగీకరించలేదు. 
 
రెండు వైపులా వాదనలు విన్న పంచాయతీ పెద్దలు మగ పెళ్లివారిదే తప్పని తేల్చి, 75 పైసలు జరిమానాగా విధించారు. అంతే కాదు, ఆ మొత్తాన్ని అనాజ్ మండిలోని శివాలయ ధర్మశాలకు విరాళంగా ఇవ్వాలని తీర్పిచ్చారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments