Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్ బడ్డీకి రూ.132 కోట్ల కరెంట్ బిల్లు: హర్యానా ఈబీ షాక్!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:31 IST)
హర్యానా రాష్ట్ర విద్యుత్ శాఖ దీపావళి రోజున ఓ ఘనకార్యం చేసింది. ఓ పాన్‌వాలాకు ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పంపి షాకిచ్చింది. ఆ బిల్లు చూసిన ఆ పాన్ వాలా కళ్లు బైర్లు కమ్మాయి. హర్యానా విద్యుత్ బోర్డుతో ఇదేంటండీ బాబూ అని మొరపెట్టుకున్నాడు. అయితే ఈ పారపాటును గ్రహించి నాలుక్కరుచుకున్న హర్యానా విద్యుత్ బోర్డు ఇప్పుడేం చేయాలా అనే తర్జనభర్జనలో పడింది. 
 
ఇదే అంశంపై పాన్ వాలా మాట్లాడుతూ ఇంత భారీ కరెంట్ బిల్లును చూసి షాకైపోయాను. అంకెల్లో ఏమైనా తప్పు పడిందేమోనని నిశితంగా పరిశీలించగా అక్షరాల్లో కూడా అంతే మొత్తం ఉండటంతో షాక్‌కు గురయ్యాను. 
 
నా పాన్ షాప్‌లో కేవలం ఒక బల్బు, ఒక ఫ్యాన్‌ను మాత్రమే వినియోగిస్తున్నాను. ఇప్పటి వరకు నాకు నెలకు రూ.1000 లోపే బిల్లు వచ్చేది. ఈ నెల మాత్రం 132 కోట్ల రూపాయల బిల్లు రావడం విచిత్రంగా ఉందన్నాడు. సాధారణంగా ఎక్కువ మొత్తంలో బిల్లు వస్తే ముందు బిల్లు కట్టండి ఆ తర్వాత అడ్జెస్ట్ చేద్దామని చెప్పే అధికారులు ఇప్పుడు ఈ 132 కోట్ల విషయంలో ఏమంటారో చూడాలి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments