Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుగెత్తుకుమటూ వచ్చి అపార్టుమెంటులో దూరిన చిరుత...

Webdunia
బుధవారం, 3 జనవరి 2024 (12:41 IST)
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో ఓ చిరుత పులి... పరుగెత్తుకుంటూ వచ్చిన అపార్టుమెంటులో దూరింది. నర్సింగాపూర్ గ్రామంలో రోడ్డుపక్కన ఉన్న అపార్టులోకి వచ్చి చేరడంతో ఆ అపార్టుమెంటు వాసులు భయంతో వణికిపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు రంగంలోకి అపార్టుమెంటులో నక్కిన చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నర్సింగాపూర్ గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న ఓ అపార్టుమెంటు మెట్లు ఎక్కి పైకి చేరుకుంది. ఆ తర్వాత కాసేపటికే అది కిందికిదిగి రావడం అక్కడ అమర్చిన సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. విషయం తెలిసిన ప్రజలు భయంతో బిక్కచచ్చిపోయారు. సమాచారం అందుకున్న అటవీ, పోలీసు అధికారులు వలలతో వచ్చి దానిని బంధించే ప్రయత్నం చేశారు. డిసెంబరు నెలలో కూడా పూణెలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడిన చిరుతను అటవీ అధికారులు చాకచక్యంగా పట్టుకుని అటవిలో వదిలిపెట్టారు. 
 
గర్భవతిని చేస్తే రూ.15 లక్షలు.. నమ్మితే నట్టేట మునిగినట్టే... 
 
సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలను గర్భవతులను చేస్తే రూ.10 లక్షలు రూ.15 లక్షలు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. ఇదేదో బాగుందని ఆశపడ్డారో.. నట్టేట మునిగిపోతారు. బ్యాంకులో ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాల్సివుంటుంది.  
 
ప్రస్తుతం సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుంది. సైబర్ నేరగాళ్లు రోజురోజుగా రాటుదేలిపోతున్నారు. దీంతో కొత్త పంథాను ఎంచుకుంటూ అమాయకులను మోసం చేస్తూ నిలువుదోపిడీ చేస్తున్నారు. తాజాగా మహిళకు గర్భంచేస్తే రూ.15 లక్షలు ఇస్తామంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆఫర్. 
 
తాము ఐశ్వర్యవంతులమే అయినా సంతాన లేని లోటును తమను వేధిస్తుంది. అందువల్ల ఇలాంటి అభ్యర్థన చేయాల్సివస్తుందంటూ పాచిక వేస్తారు. పొరపాటున ఎవరైనా ఆవేశపడితే మాత్రం ఉన్నదంతా ఊడ్చిపారేస్తారు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఇలాంటి మోసాలకు బారినపడి బాధితులుగా మిగిలిపోయిన వారి నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. భార్యాభర్తలుగా నటిస్తూ సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ఇలా అభ్యర్థిస్తే ఆవేశపడొద్దని, దానిని మోసంగా భావించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments