Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ : రేపే ప్రమాణ స్వీకారం

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (14:35 IST)
హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పరిశీలకుడిగా మంగళవారం జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈయన బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
కాగా, 40 ఏళ్ల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకర్తగా పని చేసిన ఆయన 20 ఏళ్ల క్రితం బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్రమోదీకి మంచి స్నేహితుడు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన ఖట్టర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. మంగళవారం చండీగఢ్‌లో సమావేశం అయిన హర్యానా బీజేపీ శాసనసభపక్ష సమావేశం ఖట్టర్‌ను తన నాయకుడుగా ఎన్నుకుంది. 
 
హర్యానా కొత్త సీఎం ఎంపిక కోసం పరిశీలకుడుగా కేంద్రపట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం వెళ్లగా, రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌, రామ్‌ విలాస్‌ శర్మ, ధన్‌కర్‌, కెప్టెన్‌ అభిమన్యు తదితరులు పోటీపడ్డారు. అయితే పదవి మాత్రం ఖట్టర్‌నే వరించింది. ఖట్టర్‌ కర్నాల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 
 
గత 15 యేళ్లుగా జాట్‌లే హర్యానా సీఎంలుగా వ్యవహరిస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ జాట్‌యేతర అభ్యర్థి అయిన ఖట్టర్‌ను హర్యానా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ఈ విధంగా జాట్‌యేతరులను సంతృప్తి పరచవచ్చుననే ఉద్దేశంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments