Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ సెక్స్ సీడీ బయటకు తెస్తా : హార్దిక్ పటేల్

తనకు పది కోట్ల రూపాయలు ఇస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సెక్స్ సీడీలను బయటకు రిలీజ్ చేస్తానని పటీదార్ ఉద్యమ యువనేత హార్దిక్ పటేల్ ప్రకటించారు.

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (10:56 IST)
తనకు పది కోట్ల రూపాయలు ఇస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సెక్స్ సీడీలను బయటకు రిలీజ్ చేస్తానని పటీదార్ ఉద్యమ యువనేత హార్దిక్ పటేల్ ప్రకటించారు. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ప్రచారం వేడెక్కింది. ఇందులోభాగంగా, నేతల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. 
 
ఈనేపథ్యంలో హార్దిక్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ, తన రాసలీలల సీడీ వెలుగులోకి వచ్చిన విధానాన్ని వివరించాడు. ఆ సీడీ నకిలీదని, మార్ఫింగ్ చేశారని చెబుతూ, తనకు ఓ పది కోట్ల రూపాయలు ఇస్తే, ప్రధాని నరేంద్ర మోడీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సెక్స్ సీడీలను విడుదల చేస్తానని ప్రకటించారు.
 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంప్యూటర్ టెక్నాలజీలో గ్రాఫిక్స్ సాయంతో వారిని చొప్పించడం పెద్ద కష్టమైన పనేమీ కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దిగజారుడు తనానికి నిదర్శనమే తనపై ఆరోపణలని వ్యాఖ్యానించిన ఆయన, ఈ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ ఇటువంటి పనులు చేస్తోందని అన్నారు. 
 
ఈ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు రాష్ట్రంలోని పటీదార్లు, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలు సిద్ధంగా ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు. కాగా, ఈ ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రంలో బలమైన సామాజికవర్గంగా ఉన్న పటీదార్లు ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం