Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీ కుదిరితే కేసు కొట్టేస్తారా.. టీచర్‌ను ప్రాసిక్యూట్ చేయండి.. సుప్రీంకోర్టు

ఠాగూర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (11:19 IST)
లైంగిక వేధింపుల కేసులో రాజీ కుదిరిందనే కారణంతో కేసు కొట్టేస్తారా అని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ మేరకు లైంగిక వేధింపుల కేసులో ఓ టీచర్ పై నమోదైన ఎఫ్ఎస్ఐఆర్‌ను కొట్టేయాలంటూ రాజస్థాన్ హైకోర్టు వెలువరించిన తీర్పును పక్కన పెట్టింది. సదరు టీచర్‌ను ప్రాసిక్యూట్ చేయాలని పోలీసులను ఆదేశించింది.
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 2022లో రాజస్థాన్‌లోని గంగాపూర్ సిటీలో ఓ దళిత బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విమల్ కుమార్ గుప్తా అనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాలిక పోలీసులను ఆశ్రయించడంతో విమల్ కుమార్ గుప్తాపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల మేరకు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ జరుగుతుండగా విమల్ కుమార్ గుప్తా బాధిత కుటుంబంతో రాజీ కుదుర్చుకున్నాడు.
 
అపోహతో, మిస్ అండర్ స్టాండింగ్ వల్ల తాము కేసు పెట్టామని, టీచర్ గుప్తాపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని తాము కోరుకోవడంలేదంటూ బాలిక తల్లిదండ్రులతో ఓ స్టాంప్ పేపరులో రాయించుకున్నారు. ఈ పేపర్‌ను పోలీసులకు సమర్పించగా వారు కోర్టులో ఫైల్ చేశారు. అయితే, కోర్టు ఈ స్టాంప్ పేపర్‌ను ఆమోదించలేదు. దీంతో గుప్తా రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసు విచారించిన హైకోర్టు.. స్టాంప్ పేపర్‌ను పరిశీలించి, బాలిక తల్లిదండ్రుల వాంగ్మూలం తీసుకున్నాక కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. గుప్తాపై నమోదైన ఎఫ్ఎఆర్‌ను కొట్టేయాలంటూ పోలీసులను ఆదేశించింది.
 
ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు తీర్పుపై సోషల్ వర్కర్ రాంజీ లాల్ భైర్వా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుప్తాపై నమోదైన ఎఫ్ఎస్ఐఆర్‌ను కొట్టివేయడాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. లైంగిక వేధింపుల కేసులో రాజీకి అవకాశం లేదని పేర్కొంది. పైగా ఈ కేసులో పోక్సో చట్టం, అట్రాసిటీ యాక్ట్ కలిసివున్నాయని గుర్తు చేసింది. టీచర్ విమల్ కుమార్ గుప్తాపై ఎఫ్ఐఆర్ పునరుద్ధరించి, ఆయనను ప్రాసిక్యూట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజర్ టీజ‌ర్ రిలీజ్‌కు 11 చోట్ల భారీ స‌న్నాహాలు

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం