Webdunia - Bharat's app for daily news and videos

Install App

27 ఏళ్ల వ్యక్తితో.. 40 ఏళ్ల మహిళకు అక్రమ సంబంధం: అత్త, భర్తను ఏం చేసిందంటే?

27 ఏళ్ల వ్యక్తితో.. 40 ఏళ్ల మహిళకు అక్రమ సంబంధం. జిమ్‌ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి కారణమైంది. ఆ విషయం 40ఏళ్ల మహిళ భర్తకు, అత్తకు తెలిసి పోయింది. ఇక లాభం లేదనుకుని ప్రియుడితో కలిసి అత్త, భర్తను చం

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (17:18 IST)
27 ఏళ్ల వ్యక్తితో.. 40 ఏళ్ల మహిళకు అక్రమ సంబంధం. జిమ్‌ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి కారణమైంది. ఆ విషయం 40ఏళ్ల మహిళ భర్తకు, అత్తకు తెలిసి పోయింది. ఇక లాభం లేదనుకుని ప్రియుడితో కలిసి అత్త, భర్తను చంపేందుకు మహిళ చేసిన ప్రయత్నం ఏమైందంటే..? పశ్చిమ ఢిల్లీలో అబ్ధుల్ (27) అనే వ్యక్తి జిమ్‌ను నిర్వహిస్తున్నాడు ఈ జిమ్‌కు వ్యాయామం కోసం వచ్చిన 40 ఏళ్ల మహిళతో అతనికి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం అత్త నారాయణి, భర్త అనూప్‌కి తెలిసిపోయింది. 
 
40 ఏళ్ల మహిళను ఎంత హెచ్చరించినా లాభం లేకపోయింది. జిమ్‌కు వెళ్ళొద్దని కట్టడి చేశారు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్త, అత్తను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం అత్త, భర్త తీసుకునే ఆహారంలో నిద్రమాతలు కలిపింది. వారికి డౌట్ రాకుండా ఉండేందుకు అదే ఆహారాన్ని తీసుకుంది. దీంతో అంతా మత్తులోకి జారిపోయారు. 
 
ఈ సమయంలో ఆమె ప్రియుడు అబ్దుల్ వచ్చి, అత్త, భర్తలపై దాడి చేశాడు. వారిద్దరూ చనిపోయారనుకుని వెళ్లిపోయాడు. అయితే బంధువులు వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయం నుంచి కోలుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అబ్ధుల్‌ను విచారించగా నిజాలేంటో వెలుగులోకి వచ్చేశాయి. దీంతో అబ్ధుల్‌తో పాటు అతని ప్రియురాలిని కూడా జైలుకు పంపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments