Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత యువతిని పెళ్ళి చేసుకున్నాడనీ అగ్రకుల యువకుడిని కొట్టి చంపేశారు..

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (16:48 IST)
ఢిల్లీ నగర శివారు ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ అగ్రకుల యువకుడు తాను ప్రేమించిన దళిత యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని మరికొందరు అగ్రకులస్థులు కొట్టి చంపేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీ శివారు ప్రాంతమైన గురుగావ్‌కు 26 యేళ్ళ ఆకాశ్ అనే యువకుడు ఓ దళిత యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని దళిత యువతి సొంతగ్రామానికి చెందిన కొందరు అగ్రకులస్థులు దాడిశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆకాశ్ చనిపోయాడు. 
 
ఈ ఘటనపై మృతుడి సోదరుడు మాట్లాడుతూ, ఐదు నెలల క్రితం దళిత యువతిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి బెదిరింపులు వస్తున్నాయని చెప్పాడు. గత ఆదివారం భార్య తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ఆమెతో పాటు గురుగావ్‌లోని బాద్షాపూర్‌కు తన సోదరుడు వెళ్లాడని... ఆ సందర్భంగా గ్రామంలో ఆయనపై దాడి చేశారని తెలిపాడు.
 
ఈ కేసుకు సంబంధించి ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరు రిమాండ్ లో ఉన్నారు. ఆకాశ్‌ను హత్య చేసిన ఐదుగురూ దళిత యువతి గ్రామానికి చెందినవారే. వీరు ఐదుగురు అగ్రవర్ణానికి చెందినవారు. ఈ కారణం వల్లనే గ్రామంలోకి రావద్దంటూ అతడిని హెచ్చరించారు. అయినా గ్రామంలోకి రావడంతో కొట్టి, చంపేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Idli Kottu Review: ధనుష్ ఇడ్లీ కొట్టుతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా... ఇడ్లీ కొట్టు రివ్యూ

Nayana tara: మన శంకర వర ప్రసాద్ గారు జీవితంలో శశిరేఖ ఎవరు...

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments