Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ దంపతుల వద్ద 45 పిస్టల్స్ స్వాధీనం

Webdunia
గురువారం, 14 జులై 2022 (11:01 IST)
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారతీయ దంపతులను సోదా చేయగా, వారి నుంచి ఏకంగా 45 పిస్టల్స్‌ను ఎయిర్ పోర్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారిద్దరినీ అరెస్టు చేశారు. ఈ దంపతులను జగ్జీత్ సింగ్, జస్వీందర్ కౌర్‌గా గుర్తించారు. 
 
పైగా, ఈ కేసును నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ విచారిస్తుంది. ఎన్.ఎస్.జీ అధికారులు పరిశీలించి ఈ తుపాకులు నిజమైనవేనని తేల్చింది. అదేసమయంలో ఈ తుపాకులు పూర్తిగా పనిచేసే స్థితిలోనే ఉన్నాయని ఓ కస్టమ్స్ అధికారి తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న తుపాకీల విలువ రూ.22.5 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. 
 
మరోవైపు, అరెస్టు చేసిన దంపతులు వియత్నాంలోని హోచిమిన్ సిటీ నుంచి ఢిల్లీకి వచ్చారు. వీరివద్ద ఉన్న రెండు బ్యాగుల్లో ఈ తుపాకులను గుర్తించారు. వాటిని తన సోదరుడు మంజీతి సింగ్ ఇచ్చినట్టు జగ్జీత్ వద్ద జరిపిన విచారణలో వెల్లడించారు. 
 
ఈ పిస్టళ్లను మంజీత్ సింగ్ ఫ్రాన్స్‌లోని పారిస్ నుంచి వియత్నాంకు తెచ్చి తమకు ఇచ్చారని, వాటిని తాము ఢిల్లీకి తీసుకొచ్చినట్టు చెప్పారు. పైగా, గతంలో తామిద్దరం టర్కీ నుంచి 25 పిస్టళ్లను కూడా తెచ్చినట్టు ఈ దంపతులు పోలీసుల విచారణలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments