Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి విందు భోజనం ఆరగించి 1200 మంది అస్వస్థత

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (09:56 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఓ పెళ్లి విందులో అపశృతి చోటుచేసుకుంది. దీంతో 1200 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరంతా పెళ్లి విందు భోజనాన్ని ఆరగించిన తర్వాత అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని మోహసనా జిల్లాలో జరిగింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం తగ్గి దేశ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో విందులు, వినోదాలు, శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత తన కుమారుడు పెళ్లిని ఘనంగా నిర్వహించారు. 
 
ఈ పెళ్లికి భారీ సంఖ్యలో అతిథులు తరలివచ్చారు. ఈ పెళ్లితంతు ముగిసిన తర్వాత పెళ్లి విందు భోజనం ఆరగించారు. అయితే, ఈ భోజనం కలుషితమై ఉండటంతో వారంతా అస్వస్థతకు గురయ్యారు. 
 
ఈ ఆహారం ఆరగించిన చాలా మందికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. విందులో ఏర్పాటు చేసిన ఆహార నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. 
 
మరోవైపు, ఈ ఘటనపై ఫుడ్ అండ్ డ్రగ్ విభాగం అధికారులు దర్యాప్తు చేపట్టారు. విందులో అతిథులు వడ్డించిన ఆహార పదార్థాల్లో మాంసాహారం కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ విందులో ఉపయోగించిన మాంసం నిల్వ చేయడం వల్ల ఇలా జరిగిందా? లేక వేరే కారణాలా? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments