GSLV మిషన్ ఫెయిల్ : సాంకేతిక లోపంతో ఫెయిల్

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (09:49 IST)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గురువారం చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే విఫలమైంది. మూడో దశలో సాంకేతిక లోపంతో ఈ ప్రయోగం విఫలమైనట్టు ఇస్రో ఛైర్మన్ శివన్‌ ప్రకటించారు. 
 
భూ పరిశీలన ఉపగ్రహం (ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ - ఈఓఎస్-03)​ ఉప గ్రహాన్ని అనేక ప్రయోజనాలు పొందేలా ఇస్రో రూపొందించింది. దేశ భూభాగం, సరిహద్దులు, అడవులకు సంబంధించి స్పష్టమైన ఛాయా చిత్రాలను పంపేలా తయారు చేశారు. కుంభవృష్టి, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులపై కూడా త్వరగా అప్రమత్తమయ్యేలా సమాచారం పొందే ఉద్దేశంతో రూపొందించారు.
 
ఈ వాహననౌక ప్రయోగాన్ని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్​ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్ కేంద్రం నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10 ద్వారా ఈవోఎస్​-3ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. 38 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉప గ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండగా.. ప్రయోగం విఫలమైంది. 
 
మూడో దశ అయిన క్రయోజనిక్‌ దశలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ ప్రయోగం విఫలమైనట్టు ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. దీంతో అది నిర్దేశిత మార్గంలోకాకుండా మరోమార్గంలో వెళ్లిందని, ఫలితంగా ప్రయోగం విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments