Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైందనే సంతోషంలో డ్యాన్స్ చేశాడు.. కుప్పకూలిపోయాడు.. ఆ తర్వాత ఏమైంది?

గుజరాత్‌లో ఘోరం జరిగింది. ఓ వివాహవేడుకలో డాన్స్ చేస్తున్న వరుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆపై తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... గుజరాత్ లోని రనోలికి చెందిన సాగర్ సోలంకి (23) క

Webdunia
శనివారం, 13 మే 2017 (11:49 IST)
గుజరాత్‌లో ఘోరం జరిగింది. ఓ వివాహవేడుకలో డాన్స్ చేస్తున్న వరుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆపై తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... గుజరాత్ లోని రనోలికి చెందిన సాగర్ సోలంకి (23) కి సమీప గ్రామంలోని యువతితో వివాహం జరిగింది. వివాహానంతరం స్నేహితులు, బంధువులతో బరాత్‌లో సాగర్ సోలంకి పాల్గొన్నాడు.
 
పెళ్లైన సంతోషంలో విపరీతంగా డ్యాన్స్ చేశాడు. స్నేహితుడి భుజాలపై కూర్చుని ఉత్సాహంగా డాన్స్ చేస్తూ తలవాల్చేశాడు. దీంతో భుజాలపైనుంచి అతని స్నేహితుడు కిందికి దించి సపర్యలు చేయగా, ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.
 
వరుడిని పరీక్షించిన వైద్యులు అతడు తీవ్ర గుండెపోటుతో మరణించినట్లు తేల్చారు. దీంతో వివాహానికి హాజరైన బంధుమిత్రులు షాక్‌కు గురయ్యారు. ఇంకా పెళ్లి సందడి పూర్తికానీ ఆ ఇంట విషాదం చోటుచేసుకోవడంతో అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments