Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పతాగిన పెళ్లి కొడుకు.. పెళ్లికి నో చెప్పిన వధువు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 11 మే 2022 (17:43 IST)
పెళ్లికొడుకు మద్యం సేవించి వేదికపైకి రావడంతో పెళ్లి కూతురు పెళ్లికి నిరాకరించిన ఘటన రేవాలోని గులాబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఊరేగింపు తర్వాత పెళ్లికూతురు వరుడికి షాక్ ఇచ్చింది. మద్యం మత్తులో వున్న అతడిని వివాహం చేసుకునేందుకు నో చెప్పేసింది. 
 
మత్తులో తడబడుతున్న వరుడి చర్యలను చూసి వధువు కోపం తీవ్రరూపం దాల్చింది. పెళ్లికి నిరాకరించింది. ఈ సందర్భంగా వివాహ వేదికలో తోపులాట జరిగింది. ఈ ఘటన తర్వాత మళ్లీ పెళ్లికి అమ్మాయి తరఫు వారిని ఒప్పించేందుకు అబ్బాయి తరపు వారు చాలా ప్రయత్నించారు. కానీ విషయం వర్కవుట్ కాలేదు.
 
చివరగా మరుసటి రోజు ఉదయం వధువు లేకుండా ఊరేగింపు తిరిగి వెళ్ళింది. ఈ ఘటన జరిగిన తర్వాత అర్థరాత్రి వివాహ వేదికలో జరిగిన కోలాహలం, వివాహ వేడుకకు ఖర్చు చేసిన రూ.5 లక్షల మొత్తాన్ని తిరిగి తీసుకోవాలని యువతి తరఫు వారు పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని శాంతింపజేశారు. 
 
గులాబ్ నగర్‌లో నివసించే విమల్ దూబే కుమార్తె, నెహ్రూనగర్‌లో నివసించే పీయూష్ మిశ్రాతో వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లి కొడుకు మద్యం సేవించి పెళ్లి వేదికకు రావడంతో వధువు అతనిని చేసుకునేది లేదని తెగేసి చెప్పింది.  
 
అబ్బాయి తరపు బంధువులు ఈ విషయంలో వధువు తరపు బంధువులను ఎంతగానో వేడుకున్నారు. కానీ వధువు చలించలేదు. పెళ్లికి నిరాకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments