Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు క్యాన్సర్.. వేరొక మహిళతో సంబంధాలు.. సొంత ఇంటికే కన్నం వేశాడు..

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (14:17 IST)
భార్య క్యాన్సర్‌తో బాధపడుతుందని తెలియగానే వేధింపులు మొదలెట్టాడు. అతని వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా కొన్నాళ్లు జైలులో గడిపారు. అంతే జైలు నుంచి విడుదలయ్యాక కక్ష్య పెంచుకున్న అతడు సొంత ఇంటికి కన్నం వేశాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 47 ఏళ్ల మహిళకు 25 ఏళ్ల క్రితం సురేంద్ర సింగ్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. సురేంద్ర ఓ ప్రైవేటు సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే భార్యకు క్యాన్సర్ అని తెలియరావడంతో ఆమెను వేధింపులకు గురి చేశాడు. అతడి వేధింపులు తాళలేక భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా జైలుకెళ్లిన అతడు తిరిగి రావడంతో.. భార్య వుంటున్న సొంత ఇంటికే కన్నం వేశాడు. 
 
సురేంద్ర తన సోదరుడు శైలేంద్ర, స్నేహితుడు నితిన్‌తో కలిసి.. సొంతింట్లోని బంగారాన్ని కాజేశాడు. ఈ వ్యవహారంపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు క్యాన్సర్ వుందని తెలిశాక, సురేంద్ర వేరొక మహిళలతో గడుపుతున్నాడని.. ఆమెను పెళ్లాడేందుకే తన బంగారాన్ని కాజేశాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో వున్న సురేంద్ర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments