Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమోసాలు తీసిస్తానని తాత, మేనమామ బాలికపై గ్యాంగ్ రేప్.. రూ.20లను ఇచ్చి..?

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (19:34 IST)
మహిళలపై వయోబేధం లేకుండా, వావి వరుసలు లేకుండా లైంగిక దాడులు జరుగుతూనే వున్నాయి. కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి ఘటనలు తగ్గట్లేదు. తాజాగా ఆరేళ్ల బాలికపై ఆమె తాతయ్య, మేనమామ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. 
 
బాలిక సోదరుడి ముందే వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఎనిమిది రోజుల కిందట జరిగిన ఈ ఘోరం గురువారం సాయంత్రం వెల్లడైంది. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి ప్రశ్నించడంతో జరిగిన విషయం బాధితురాలు వివరించింది.
 
ఆపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై కేసు నమోదైంది. కొద్దిరోజుల కిందట తన మేనమామ సమోసాలు ఇస్తానని తనను, తన సోదరుడిని బంధువుల ఇంటికి తీసుకువెళ్లాడని, అక్కడ అప్పటికే తాత ఉన్నాడని బాధితురాలు పేర్కొంది. 
 
వారు సోదరుడి ఎదుటే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో తెలిపింది. నిందితులు బాలికకు రూ.20 ఇచ్చి ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని కోరారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం